Header Banner

రానున్న ఐదు రోజులు వర్షాలు... ఏఏ జిల్లాల్లో అంటే! అక్కడక్కడ అధిక వర్షపాతం..

  Tue Apr 01, 2025 19:27        Environment

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి తీపి కబురు. వేసవిలో భానుడు తాపానికి వెలవెలలాడుతున్న ప్రజలకు ఉపశమనం రాబోతుంది. మరఠ్వాడా పరిసర ప్రాంతంలోని 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనితో పాటు బంగాళాఖాతం నుండి, అరేబియా సముద్రం నుండి గాలులు రావడం వలన రానున్న ఐదు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన జల్లులు ఏప్రిల్ 2వ తేదీన ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీన అక్కడక్కడ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఏపీ ప్రజలకు ఐదు రోజులు పాటు చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ 3వ తేదీ, 4వ తేదీన మన్యం జిల్లాల్లో అధిక వర్షపాతం ఉంటుందని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: భారతదేశం జాక్‌పాట్‌.. భారీగా బయటపడ్డ బంగారం! త్వరలోనే ఒక్కసారిగా పాతాళంలోకి గోల్డ్ రేట్స్..?

 

మూడు, నాలుగు తేదీల్లో ఈదురు గాలులు 40 నుండి 50 కి.మీ వేగంతో వీస్తాయని తెలిపారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా వానలు కురుస్తాయని వెల్లడించారు. గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. సమ్మర్‌లో వచ్చే వర్షాలు తక్కువ సమయంలో పడే చిరుజల్లులు వస్తాయని తెలుపుతున్నారు. అధిక వర్షపాతం ఉన్నప్పటికీ ఎక్కువ సమయం ఉండదని తెలుపుతున్నారు. ఒక్కో సమయంలో వడగళ్ళ వాన వస్తుందని తెలిపారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather